ఇంటర్ ఫైనల్ ఫలితాలు నేడు
ఉదయం 11.30కు వెల్లడి..ఈసేవ, ఏపీ ఆన్‌లైన్, ఐవీఆర్‌ఎస్‌లో మార్కులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంటర్ ఫైనలియర్ ఫలితాలు గురువారం ప్రకటించనున్నారు. ఉదయం 11.30కు ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జి. బలరామయ్య ప్రకటించారు. జనరల్, వొకేషనల్ పరీక్ష ఫలితాల్ని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి విడుదల చేస్తారు. ఫలితాలు విడుదల చేయగానే మార్కులు, గ్రేడుల్ని.. వెబ్‌సైట్, ల్యాండ్‌లైన్, ఈసేవా కేంద్రాలు, ఎస్‌ఎంఎస్ సహాయంతో తెలుసుకొనేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఐవీఆర్‌ఎస్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్)తోపాటు ఆరు ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈసేవా కేంద్రాలు, ఏపీ ఆన్‌లైన్ సేవా కేంద్రాల ద్వారా సబ్జెక్టుల వారీగా మార్కులు తెలుసుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా మొబైల్ ఫోన్‌లోనూ, ఎస్‌ఎంఎస్ సాయంతో మార్కులు వెల్లడిస్తారు. వెబ్‌సైట్ల ద్వారా గ్రేడ్లు తెలుసుకొనేందుకు అవకాశముంది.
ఏపీ ఆన్‌లైన్ ద్వారా మార్కులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ ఆన్‌లైన్ సేవా కేంద్రాల్లోనూ మార్కులు తెలుసుకోవచ్చు. మార్కులు తెలుసుకొనేందుకు పరిష్కారం కాల్ సెంటర్(ఈసేవా), పట్టణ ఈ సేవా కేంద్రాలు, గ్రామీణ ఈసేవా(రాజీవ్ ఇంటర్నెట్) కేంద్రాల్లోని బిఎస్‌ఎన్‌ఎల్ ఫిక్స్‌డ్ ఫోన్‌లైన్ల ద్వారా 1100 కు డయల్ చేయవచ్చు. ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా 18004251110 కు డయల్ చేసి మార్కులు తెలుసుకోవచ్చు.

INTER RESULTS
http://examresults.ap.nic.in
www.aponline.gov.in
http://results.cgg.gov.in
www.esevaonline.com
http://results.apit.ap.gov.in
http://portal.ap.gov.in