ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌చే ఉచిత క్రికెట్ శిక్షణ
తిరుపతి కల్చరల్,మేజర్‌న్యూస్:ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో ఉచిత వేసవి క్రికెట్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సౌత్‌జోన్ కార్యదర్శి వి.ఉమామహేశ్వర తెలిపారు.మే నెల 1 నుంచి 31 వ తేది వరకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు.తిరుపతి రూరల్ తుమ్మలగుంట, చిత్తూరులోని జిల్లా క్రీడా అభివృద్ధి సంస్ధ ఔట్‌డోర్ స్టేడియం, కలికిరి ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఈ శిక్షణను ఏర్పాటుచేసినట్లు వివరించారు.12 నుంచి 22 ఏళ్లలోపు వయస్సున్న బాల బాలికలకు అర్హత కలిగిన కోచ్‌ల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.
ఈ శిబిరాలను మేటి క్రీడాకారులు ఎంఎస్‌కె ప్రసాద్,మధుసూదనరాజు,సత్యప్రసాద్ యాచేంద్ర,పూర్ణిమరావులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆటతీరును మెరుగు పరుచుకొనేందుకు వీలుగా విడియో అనలిస్టులు అందుబాటులో వుంటారని చెప్పారు.ఆసక్తి కలిగిన వారు మే నెల 1వ తేది ఉదయం 6 గంటలకు సమీపంలోని నిర్ధేశిత కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు.మరిన్ని వివరాలకు తిరుపతికి సంబంధించి ఆర్.కె.మురగన్ సెల్-98490 26131, కె.యస్.రెడ్డి-98852 20048, మధుకర్‌రెడ్డి-98490 33382,చిన్ని- 98490 98747, ఎ.వెంకటరమణ-89853 22009, కలికిరిలో సురేంద్రనాథ్‌రెడ్డి-94404 64521, డాక్టర్ మహేంద్ర-99631 88955, టి.వి.రమణ-98666 63862, చిత్తూరులో సయ్యద్‌సాహెబ్-97004 53204లను సంప్రదించవచ్చని అన్నారు.