
పల్లవి :
ఆ... ఆ... ఆ.....
తెలుసుకొనవె యువతీ
అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతీ...
చరణం : 1
యువకుల శాసించుటకే...
యువకుల శాసించుటకే
యువతులవతరించిరని
॥
చరణం : 2 సాధింపులు బెదరింపులు
ముదితలకిక కూడవని (2)
హృదయమిచ్చి పుచ్చుకునే...
హృదయమిచ్చి పుచ్చుకునే
చదువేదో నేర్పాలని
॥
చరణం : 3 మూతి బిగింపులు అలకలు
పాతపడిన విద్యలనీ (2)
మగువలెపుడు మగవారిని...
మగువలెపుడు మగవారిని
చిరునవ్వుల గెలవాలని
॥
గానం : ఎ.ఎం.రాజా
పల్లవి :
తెలుసుకొనవె చెల్లీ
అలా నడుచుకొనవె చెల్లీ
తెలుసుకొనవె చెల్లీ...
చరణం : 1
మగవారికి దూరముగా
మగువలెపుడు మెలగాలని (2)
॥
చరణం : 2 మనకు మనమె వారికడకు
పనియున్నా పోరాదని (2)
అలుసుజేసి నలుగురిలో
చులకనగా చూచెదరని (2)
॥
చరణం : 3 పదిమాటలకొకమాటయు
బదులు చెప్పకూడదని (2)
లేనిపోని అర్థాలను
మన వెనుకనె చాటెదరని (2)
॥
గానం : పి.లీల
చిత్రం : మిస్సమ్మ (1955)
(దర్శకత్వం : ఎల్.వి.ప్రసాద్)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
Audio