గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాన్
‘ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకోగానే దర్శకుడుగా హరీష్ శంకర్ అయితే బాగుంటుందనుకున్నా’’ అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన చెబుతున్నది హిందీ చిత్రం ‘దబాంగ్’ గురించి. సల్మాన్ ఖాన్, సొనాక్షి జంటగా రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూసి.. తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో హీరోగా నటించడంతోపాటు స్వయంగా తనే నిర్మించాలని కూడా అనుకున్నారు. అందుకని ‘పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బేనర్‌ను ఆరంభించారు. తెలుగులో ఈ చిత్రానికి ‘గబ్బర్ సింగ్’ అనే టైటిల్‌నుఖరారు చేశారు.
శనివారం ఈ చిత్రవిశేషాలను హీరో, నిర్మాత పవన్‌కళ్యాణ్ చెబుతూ -‘‘నా బేనర్‌లో నిర్మించబోతున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ గబ్బర్ సింగ్‌గా నటించబోతున్నాను. వాస్తవానికి హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇంతకుముందే సినిమా చేయాల్సి ఉంది. తను ‘మిరపకాయ్’ స్టోరీతో పాటు మరికొన్ని కథలు కూడా చెప్పాడు. హరీష్ కథ చెప్పిన విధానం నాకెంతో నచ్చింది. ఈ సినిమాకి తనే యాప్ట్ అనిపించి, దర్శకుడిగా ఎన్నుకున్నాను. త్వరలో ఈ చిత్రాన్ని ఆరంభించనున్నాం. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల అవుతుంది’’ అన్నారు.
హిందీలో ‘దబాంగ్’ సంచలన విజయం సాధించిన విషయం విదితమే. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని మంచి టెక్నికల్ వేల్యూస్‌తో రాజీపడకుండా నిర్మించాలనుకుంటున్నారు. ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని పవన్ పేర్కొన్నారు.
|
|
---|