Friday, January 21, 2011

EVV no more దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ ఇకలేరు

దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ ఇకలేరు



హైదరాబాద్: సినీ దర్శకుడు, కథా రచయిత ఇ.వి.వి సత్యనారాయణ శుక్రవారం రాత్రి అపోలో ఆస్పత్రిలో మరణించారు. ఆయన కొద్దికాలంగా గొంతు క్యాన్సర్‌తో భాదపడుతున్నారు. ‘చెవిలోపువ్వు’ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ప్రేమఖైదీ చిత్రంతో ఇవివి తెలుగు చిత్ర రంగంలో సుపరిచితుడయ్యారు. ఆయన చివరి చిత్రం కత్తి కాంతారావు. అమితాబ్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజేంద్రప్రసాద్‌లాంటి అగ్రనటులతో చిత్రాలను రూపొందించిన ఘనతను ఆయన దక్కించుకున్నారు.

వారసుడు, హలో బ్రదర్, అల్లుడా మజాకా?, సూర్యవంశ్ (హిందీ)లాంటి జనరంజక చిత్రాలతోపాటు, జంబలకిడిపంబ, ఎవడిగోలవాడిది, చెవిలోపూవ్వు, తొట్టిగ్యాంగ్, ఫిట్టింగ్ మాస్టర్, బెండు అప్పారాడు ఆర్‌ఎంపీ లాంటి హస్యభరితమైన చిత్రాలను అందించారు.

పశ్చిమగోదావరి జిల్లా నిడుదవోలు మండలం కోరుమామిడిలో ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో 1956 జూన్ 10వ తేదిన జన్మించారు. ఇ.వి.వికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. సినీ నటులు రాజేష్, అల్లరి నరేష్‌లు ఇవివి కుమారులు.


ఇవివి మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణవార్తను తెలుసుకున్న పలువురు అపోలో ఆస్పత్రికి వచ్చి నివాళులర్పించి, కుటుంబాన్ని ఓదార్చారు. ఇవివి భౌతికాయాన్ని ఆయన ఇంటికి తరలించనున్నట్టు బంధువులు తెలిపారు.