యూ ట్యూబ్ టాప్ టెన్‌లో.... ‘షీలా కీ జవానీ’
వివిధ రకాల వీడియో క్లిప్పింగ్‌లను ఎక్కువగా గూగుల్ ‘యూ ట్యూబ్’లో చూస్తారు. ముఖ్యంగా అన్ని రకాల వీడియో క్లిప్పింగ్‌లు, సినిమా పాటలు, రీమిక్స్ సాంగ్స్‌ను ఇందులో తిలకిస్తారు. ఈ మేరకు యూ ట్యూబ్ ఓ హిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇండియన్స్ ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు ఎక్కువగా చూసిన వీడియోస్ లిస్ట్‌ను యూ ట్యూబ్ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ హిట్ సాంగ్ షీలా కీ జవానీ అగ్రస్థానంలో నిలిచింది. మన దేశానికి చెందిన సందర్శకులు ఈ వీడియో క్లిప్పింగును ఎక్కువగా తిలకించినట్లు యూట్యూబ్ పేర్కొంది.
యూ ట్యూబ్ విడుదల చేసిన లిస్ట్‌లో పూర్తిగా అంగవెైకల్యాన్ని కలిగిన నిక్ ఉజిసిక్ ఇనిస్పిరేషనల్ వీడియోను ఈసారి భారతీయులు ఎక్కువగా చూసినట్టు వెల్లడెైంది.కాళ్లు, చేతులు లేక ఓ వింత వ్యాధితో బాధపడుతున్న అతని జీవితంపెై రూపొందిన వీడియోను ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా చూశారని తెలిపింది. ఈ వీడియో క్లిప్పింగ్‌ను 15,275,254సార్లు చూసినట్టు యూట్యూబ్ ప్రకటించింది.ఆ తర్వాత స్థానాన్ని బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ ‘షీలా కీ జవానీ’ పాట ఆక్రమించింది. ఈ హిందీ పాటను సందర్శకులు ఎక్కువగా తిలకించారని వెల్లడెైంది.
టాప్ టెన్...
యూట్యూబ్‌లో ఎక్కువగా తిలకించిన వీడియో క్లిప్పింగ్‌ల్లో బాలీవుడ్ మ్యూజిక్ వీడియోసే ఎక్కువగా టాప్ టెన్‌లో ఉన్నాయి. ఇందులో షీలా కీ జవానీ పాట అగ్రస్థానంలో నిలిచింది. ఫెయిల్ అయిన సినిమా దిల్ బోలె హడిప్పాలోని ఓ పాట యూట్యూబ్ టాప్ టెన్‌లో చోటుచేసుకుంది. రాణీ ముఖర్జీ, షాహిద్ కపూర్‌లపెైన ఈ పాట రూపుదిద్దుకుంది. ఈ పాటను 4.5 మిలియన్ల సార్లు తిలకించారని యూట్యూబ్ పేర్కొంది. ప్రిన్స్ సినిమా కోసం పాకిస్తాన్ సింగర్ ఆసిఫ్ అస్లమ్ పాడిన తేరే లియా పాటను కూడా ఎక్కువ మంది చూశారు. హీరో వివేక్ ఒబెరాయ్‌పెై ఈ పాట రూపుదిద్దుకుంది.
అందర్ బాహర్ సినిమాలోని మౌసమ్ బడా సుహానా హై పాట, ధూమ్ 2లోని క్రేజీ కియా రే..., సైఫ్, కరీనాపెై రూపుదిద్దుకున్న ఖుర్బాన్ పాట...అజమ్ ప్రేమ్‌కీ గజబ్ కహానాలోని తు జానే పాటను యూట్యూబ్‌లో ఎక్కువగా తిలకించారు. దీంతో పాటు యూ ట్యూబ్ లో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వర కు ఇండియన్ ఐడల్, సచిన్ వన్డేల్లో 200 రికా ర్డుకు చేరుకోవ డం, ఐపిల్ లెైవ్, బిగ్ బాస్ 4, షకీరా వాకా వాకా, షీలా కి జవాని, దబంగ్, రావణ్ సిని మా, 3 ఇడియట్స్ స్పీచ్, అం జనా అంజాని, ఇన్‌సెప్షన్ వీడియోక్లిప్పింగ్‌లను ఎక్కు వగా తిలకించినట్టు గూగుల్ యూట్యూబ్ వెల్లడించింది.దీంతో పాటు పలు ప్రాంతీ య భాషల సినిమా పాటలను సైతం సందర్శ కులు తిలకిం చారని సంస్థ తెలిపింది.
Sheela Ki Jawani Tees Maar Khan 2010 - Sunidhi Chauhan, Vishal Dadlani